లారీ ఢీకొని యువకుడు మృతి.. గురండి గ్రామంలో విషాదం

కొత్తూరు, ఆంధ్రప్రభ : మండలంలోని పారాపురం వద్ద అలికాం -బత్తిలి ప్రధాన రహదారి పై కొత్తూరు నుండి తన స్వగ్రామం గురండి బైక్ పై వెళ్తున్న అలికాన ప్రసాద్ (27)అనే యువకునికి ఎదురుగా వస్తున్న ఏపీ డబ్ల్యూ ఎస్ 5689 అనే నెంబర్ కలిగిన లాvరీ బలంగా ఢీ కొంది.ఈ ప్రమాదంలో ఏపీ 39 10ఏ ఎఫ్ 6683 నెంబర్ కలిగిన బైక్ ఉన్న గురండి గ్రామానికి చెందిన అలికాన ప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగిన ఈ ప్రమాద సంఘటన పై స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తూరు మండలం, గురండి గ్రామానికి చెందిన రజక కులస్తుడు అలికాన ధర్మారావు కుమారుడు ప్రసాద్ (27) తన గ్రామము గురండి నుండి కొత్తూరు తన మోటార్ సైకిల్ పై వచ్చి, తిరిగి కొత్తూరు నుండి గురండి వెళ్ళిపోవుచున్నారు. ఇదే సమయంలో పారాపురం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరేసరికి, మెట్టూరు వైపు నుండి కొత్తూరు వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి మోటార్ సైకిల్ కి ముందు నుండి బలంగా ఢీ కొన్నాడు.

వెంటనే మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి ప్రసాద్ తన మోటారసైకిల్ తో పాటు రోడ్ పై పడిపోయి,అతని తల పైన, ముఖము పైన బలమైన రక్త గాయాలు తగిలాయి.ప్రసాద్ కి అధిక రక్తశ్రావం కావడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు.దీనితో పారాపురం, గురండి గ్రామాల్లో విషాదం అలముకుంది. సమాచారం తెలిసిన వెంటనే కొత్తూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.