క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలి: డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్

వికారాబాద్, ఆంధ్రప్రభ : క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

ఆదివారం అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అనంతరెడ్డి, కృష్ణారెడ్డి, కద్మూరు ఆనందం, అశోక్, రాజశేఖర్‌రెడ్డి, గోపాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.