యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న..

నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట మండల కేంద్రంలో యూరియా వచ్చిందని సమాచారంతో రైతులు ఫర్టిలైజర్ షాపుకు ఉదయం 6 గంటలకు చేరుకొగా యూరియా బస్తాలను ఐదు నిమిషాల్లో యాప్ లో 1000 యూరియా బస్తాలు బుక్ అయ్యాయని వచ్చిన రైతులకు యూరియా బస్తాలు దొరకకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సీఎం డౌన్ డౌన్,వ్యవసాయ అధికారి రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింప చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించకపోవడం దారుణం అన్నారు. యాప్ ద్వారా రైతులు నష్టపోతున్నారే కానీ బస్తాలు దొరకడం లేదని ప్రభుత్వం వెంటనే యాప్ ను తొలగించి పాత పద్ధతి మాదిరిగా యధావిధిగా పాసుబుక్ ల ద్వారా యూరియా బస్తాలను అందించాలని డిమాండ్ చేశారు. యాప్ పేరిట ఫర్టిలైజర్ దుకాణదారులు బ్లాకు దందా కొనసాగిస్తున్నారని యాప్ ను తొలగించాలన్నారు.