43 రోజులుగా దీక్ష.. రైతులకు న్యాయం చేయాలి..
43 రోజులుగా దీక్ష.. రైతులకు న్యాయం చేయాలి..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కళ్ళపూర్ రాపోల్ రైతులు గత 43 రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం శోచనీయమని వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ పేర్కొన్నారు. దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా పట్టా భూములను లాక్కోవాలని చూస్తుందని ఇది సరైన పని కాదని అన్నారు.
రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టాలని వారికి ప్రత్యామ్నాయంగా భూములు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మొండివైఖరితో ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండి భూసేకరణ చేస్తే మరో లగీచర్లగా మారే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 8న కొడంగల్ కు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పరిశీలించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆమె డిమాండ్ చేశారు.
