Trisha | క్రేజీ కాంబో సెట్ అయ్యిందా..?

Trisha | క్రేజీ కాంబో సెట్ అయ్యిందా..?

Trisha | త్రిష గుడ్ బై వార్తల మధ్య క్రేజీ మూవీ టాక్
నువ్వొస్తానంటే జంట మళ్లీ కలుస్తుందా?
దిల్ రాజు బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్?
త్రిష చేతిలో సినిమాల పరిస్థితి ఏమిటి?

Trisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : త్రిష.. ఒక్క తమిళ్ లోనే కాదు.. సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా.. గుడ్ పర్ ఫార్మర్ గా పేరు తెచ్చుకుంది. అయితే.. ఇటీవల ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని.. పాలిటిక్స్ లోకి వెళ్లబోతుందని.. వార్తలు వచ్చాయి. ఆమె అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. దాదాపుగా ఇదే నిజం కావచ్చని కోలీవుడ్ ఇండస్ట్రీ జనాలు చెప్పారు. అయితే.. ఇప్పుడు త్రిష.. క్రేజీ కాంబో మూవీకి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఏంటా క్రేజీ మూవీ..? ఈ క్రేజీ మూవీని నిర్మించేది.. తెరకెక్కించేది ఎవరు..?

Trisha

Trisha | నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా తర్వాత..

తెలుగు సినిమా వర్గాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే.. సిద్దార్ధ, త్రిష మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో వీరిద్దరూ కలిసి నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా సినిమాలో నటించడం.. ఆ సినిమాను ప్రభుదేవా తెరకెక్కించడం.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే. ఆతర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబోలో మూవీని సెట్ చేస్తుంది ఎవరో కాదు.. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Trisha

Trisha | దిల్ రాజు నిర్మాణంలో..

గతంలో సిద్దార్థ్, త్రిష జంటకు మంచి క్రేజ్ ఉండేది. వారి కెమిస్ట్రీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవుతుందనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, స్క్రిప్ట్ దశలోనే చర్చలు కొనసాగుతున్నాయి అనే సమాచారం. దర్శకుడు ఎవరు? కథ ఏ జానర్‌లో ఉండబోతోంది? అనే విషయాలు ఇంకా క్లారిటీ లేదు. అయితే.. దిల్ రాజు బ్యానర్‌లో వస్తోందనే వార్తే ఈ ప్రాజెక్ట్‌ పై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాని కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది.

Trisha

Trisha | అవి తప్పితే.. ఒక్క సినిమా లేదా..

ఇదిలా ఉంటే.. త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందన్న వార్తలు గతంలో వినిపించాయి. వాటి పై త్రిష స్పందించలేదు. దీంతో ప్రచారంలో ఉన్న వార్తలు నిజమే అంటూ ప్రచారం జరిగింది. అలాగే ఆమె సన్నిహితులు కూడా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అన్నట్టుగానే మాట్లాడారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా చేస్తుందని న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది. త్రిష నటించిన కరుప్పు మే 14న రిలీజ్ కానుంది. విశ్వంభర జులైలో రిలీజ్ కి రెడీ అవుతుందని టాక్. మలయాళంలో మోహన్ లాల్ తో నటించిన రామ్ మూవీ దీపావళికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇవి తప్పితే ఆమె చేతిలో ఏ సినిమా లేదు. మరి.. సిద్దార్థ్ తో కలిసి త్రిష నటించే సినిమా నిజంగా ఉంటుందా..? లేదా..? అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Trisha