Gujarat లో ఘోర రోడ్డు ప్రమాదం..
Gujarat లో ఘోర రోడ్డు ప్రమాదం..
- రెండు బస్సులు ఢీ
- ఏడుగురు మృతి!
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
గుజరాత్లోని సూరత్ జిల్లా బార్డోలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక బస్సు రోడ్డుపైనే బోల్తా పడి, క్షణాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది. వైద్య, రెస్క్యూ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
