సీఎం బాబుకు వెంకన్న, దుర్గమ్మ ఆశీస్సులు..
సీఎం బాబుకు వెంకన్న, దుర్గమ్మ ఆశీస్సులు..
- చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా..
- ప్రసాదాలు అందించిన అర్చకులు..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ ; ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానమ్, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు లార్డ్ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని సమర్పించగా, దుర్గగుడి అర్చకులు దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల ప్రసాదం, చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈఓ శీనా నాయక్ పాల్గొని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
