tragedy | ఒకే కుటుంబంలోని నలుగురు మృతి
tragedy | ఒకే కుటుంబంలోని నలుగురు మృతి
tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటకలోని విజయపుర జిల్లా మోరటగి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అద్దె ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సొంత ఇంటి మరమ్మతుల కారణంగా గురునాథ్ బడిగెర్ కుటుంబం పాత అద్దె ఇంట్లో నివసిస్తోంది. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదంలో గురునాథ్ బడిగెర్ (35), ఆయన భార్య జ్యోతి (28), కుమార్తెలు కాళమ్మ (13), కీర్తి (9) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న అధికారులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

