ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం

ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం

బెజ్జంకి, ఆంధ్రప్రభ: సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో చేపట్టిన “సురక్షా నేత్ర” కార్యక్రమంలో భాగంగా, ( అనుసంధానించబడిన గ్రామాలు – రక్షిత సంఘాలు) లక్ష్యంతో మండలంలోని వడ్లూరు, తోటపల్లి గ్రామాల్లో సీసీ కెమెరాలను బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ.. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. “ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు.

సీసీ కెమెరాల వల్ల నేరాలను వేగంగా గుర్తించడం, నిందితులను సులభంగా పట్టుకోవడం సాధ్యమవుతుందని, అలాగే నేరాల నివారణలో ఇవి ఎంతో ఉపయోగకరమని వివరించారు. గ్రామ ప్రజలు కూడా కెమెరాల సంరక్షణలో పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.

గ్రామ ప్రజలు “సురక్షా నేత్ర” కార్యక్రమాన్ని అభినందిస్తూ, తమ గ్రామాలను మరింత సురక్షితంగా మార్చేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం

Leave a Reply