8people | ఇద్దరు మహిళలు మృతి
8people | ఇద్దరు మహిళలు మృతి
8people | పి.కొత్తకోట/ చిత్తూరు,ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పి.కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వేగంగా వస్తున్న కారు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చవటపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు, చవటపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే కారు పూర్తిగా ధ్వంసం కావడంతో డోర్లు తెరుచుకోలేదు. దీంతో స్థానికులు గడ్డపారలు, ఇనుప రాడ్ల సహాయంతో డోర్లను తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలచివేశాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రోడ్డుపక్కన నిలిపిన లారీని గమనించకపోవడం లేదా అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.
ఈ ప్రమాదంతో చవటపల్లి ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాలను మళ్లించారు. ప్రమాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

