వడదెబ్బల పట్ల కూలీలకు అవగాహన

వడదెబ్బల పట్ల కూలీలకు అవగాహన

  • కల్లూరులోని ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తున్న కళాకారులు

కుంటాల, ఆంధ్రప్రభ: వడదెబ్బల పట్ల కూలీలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం కళాకారులు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. వడదెబ్బల పట్ల కూలీలు అప్రమత్తంగా ఉండాలని వేసవికాలం దృష్ట కూలీలు ఉదయం వేళలో పనికి వెళ్లి పని ప్రదేశంలో పని ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకోవాలని పేర్కొన్నారు. దగ్గర మంచినీటి సౌకర్యంతో పాటు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్టు అందుబాటులో ఉంచుకోవాలని వడదెబ్బలు పట్ల జాగ్రత్తగా వహించాలి అని పేర్కొన్నారు అదేవిధంగా బాల్య వివాహాలు చేయకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పట్ల వివరంగా తెలియజేశారు మహిళా విద్యార్థులకు మంచి నైపుణ్యమైన విద్యను చదివించిన అనంతరం పెళ్లిళ్లు చేయాలని బాల్య వివాహాలకు ప్రోత్సహించకూడదని బాల్యవివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా మాదకద్రవ్యాల అవగాహన కల్పించారు యువత చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారని వారి పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. పలు సంక్షేమ పథకాల గురించి కూలీలకు కళాజాత ద్వారా వివరించారు మిమిక్రీతో పాటు వివిధ కార్యక్రమాల చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంట వార్ దశరథ్ భాష సంస్కృతిక శాఖ కళాకారులు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply