కడెంలో ఘనంగా రంజాన్ వేడుకలు
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంతో పాటు మండలంలోని లింగాపూర్ మాసాయిపేట్ ఎలగడప సారంగాపూర్ బెల్లాల్ కొండుకూర్ మద్దిపడగ చిట్యాల్ గ్రామాలలో శనివారం రంజాన్ ( ఈద్-ఉల్-ఫితర్ ) పర్వదిన వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని పట్టణంలోని కడెం లో గల ఈద్గా వద్ద మత గురువుల (ఇమామ్ సాబ్స్) ఆధ్వర్యంలో పెద్దలు, చిన్నారులు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆ లింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అదేవిధంగా కడెం లో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులను కలుసుకొని అలాయిబలాయి తీసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులు కడెంలో గల కబరస్థాన్కు వెళ్లి వారి పూర్వీకుల సమాధుల వద్ద పూలు చల్లి ప్రార్థనలు నిర్వహించారు.
పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ ఢీకొండ విజయకుమార్ పెద్ద బెల్లాల్ సర్పంచ్ ఈదుల తిరుపతి లింగాపూర్ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ మాసాయిపేట్ సర్పంచ్ దుర్గం లహరిక ఎలగడప సర్పంచ్ నర్సింగ్ అశ్విత మద్ది పడగ సర్పంచ్ పంజాల శకుంతల బెల్లాల్ సర్పంచ్ బొంతల లక్ష్మి సారంగాపూర్ సర్పంచ్ కోల తేజస్విని చిట్యాల్ సర్పంచ్ చీమల భీమేష్ లు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
