పది ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
ఊర్కొండ, ఆంధ్రప్రభ: బుధవారం విడుదలైన పదోతరగతి ఫలితాలలో ఊరుకొండ మండలంలోని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత పొంది ప్రభంజనం సృష్టించారు. మండల కేంద్రంతోపాటుగా, ఊరుకొండపేట, మాదారం గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత పొంది విజయ దుందుభి మోగించారు. ముఖ్యంగా జడ్పీహెచ్ఎస్ ఊరుకొండపేట పాఠశాలలో అదే గ్రామానికి చెందిన విద్యార్థిని నౌసీన్ 571 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అదే గ్రామానికి చెందిన సిరిగిరి ఇందు 555 మార్కులతో మండలంలో ద్వితీయ స్థానం లభించింది.
వీటితోపాటు మండలానికి సంబంధించిన కేజీబీవీ పాఠశాలలో 578 మార్కులతో బి .వందన ప్రథమ స్థానం, ఎంజెపి పాఠశాలలో 581 మార్కులతో సాహితీ రెడ్డి ప్రథమ స్థానం, ప్రైవేటు పాఠశాలలో 573 మార్కులతో శ్రీ హర్షిత ప్రథమ స్థానంలో నిలిచారు. మండలంలో 100% ఉత్తీర్ణత పొందిన సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల విద్యాధికారి అబ్దుల్ రహీం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చిన విద్యార్థులు పై చదువులలో కూడా మంచి ప్రతిభ కనబరిచి విద్యావంతులుగా ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.
