ప్రభుత్వ పాఠశాలల్లో 92 శాతం ఉత్తీర్ణత

ప్రభుత్వ పాఠశాలల్లో 92 శాతం ఉత్తీర్ణత
- ఎంఈఓ
వేంసూరు, ఆంధ్రప్రభ: పదవ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలు 92 శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలో 218 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 201 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని, 17 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు వివరించారు. పాఠశాలల వారీగా ఉత్తీర్ణత వివరాలను ఆయన తెలియజేశారు. అరసర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 36 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు.
మర్లపాడు పాఠశాల నుంచి 33 మందికి 30 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కందుకూరు పాఠశాల నుంచి 33 మంది విద్యార్థులకు గాను 29 మంది విద్యార్థులు, కుంచపర్తి పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులకు గాను 18 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. వేంసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 49 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కాగా 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. చౌడవరం పాఠశాల నుంచి 28 మంది విద్యార్థులు పరీక్షల హాజరుకాగా 27 మంది ఉత్తీర్ణత, వెంకటాపురం పాఠశాల నుంచి 9 మంది విద్యార్థులకు గాను 8 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
కల్లూరుగూడెం పాఠశాల నుంచి 6 మంది విద్యార్థులు 6 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించి 100 శాతం ఫలితాలను నమోదు అయిందన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులు అడసర్లపాడు పాఠశాల నుంచి ఎం దివ్యశ్రీ 565 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాల టాపర్ గా నిలిచారని. ద్వితీయ స్థానంలో మర్లపాడు పాఠశాల నుంచి మన్విత 553, తృతీయ స్థానంలో కందుకూరు పాఠశాల నుంచి విజయ్ 550 మార్కులు సాధించినట్లు తెలియజేశారు, మిగిలిన పాఠశాలలో కుంచపర్తి పాఠశాల నుంచి హర్షిణి 537, వేంసూరు పాఠశాల నుంచి ఉమర్ ఫరూక్ 533, చౌడవరం పాఠశాల నుంచి కావ్య శ్రీ 533, కల్లూరుగూడెం పాఠశాల నుంచి స్రవంతి 496, వెంకటాపురం పాఠశాల నుంచి అభిలేఖ 451 మార్కులను సాధించార తెలియజేశారు.
