భక్తి శ్రద్దలతో శనేశ్వరస్వామి జయంతి పూజలు…
భక్తి శ్రద్దలతో శనేశ్వరస్వామి జయంతి పూజలు…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో శనివారం శ్రీ శనీశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో అక్కడ జయంతి వేడుకలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.నంద్యాల మండలం చాబోలు రోడ్డులో వెలసిన శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శనేశ్వరస్వామి జయంతి, అదేవిధంగా అమావాస్య కావడం తో విశేష తైలాభిషేకం పూజలు జరిగాయి.శనేశ్వరస్వామీ ఆలయ వ్యవస్థాపకులు అయ్యప్పుశెట్టి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయశర్మ శని జయంతి ప్రత్యేక పూజలు చేశారు. పరమేశ్వరుడికి భక్తులచే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చన, అభిషేకం, పంచామృతాభిషేకం, బిల్వార్చన, జలాభిషేకం చేయించి, శనేశ్వర స్వామికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి, మహా మంగళ హారతి ఇచ్చారు.
ఈ సందర్బంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శని దోష నివారణకు ఉత్తమమైన సమయం, ఏలినాటి, అష్టను, అర్ధాష్టమ శనితో బాధపడుతున్న మేష, సింహ, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజ చాలా విశేషమైన రోజు అన్నారు.
శని దేవునికి నువ్వుల నూనె తో అభిషేకం. నల్లటి వస్త్రాన్ని శనికి సమర్పించటం, బియ్యపు పిండి, ఆవుపాలతో చేసిన ప్రమిదలో నువ్వుల నూనె పోసి, నల్లని వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం అన్నారు. 79 ప్రదక్షిణలు చేయడం. పిప్పలాద కృత శని స్తోత్రం పఠించడం. సుందరకాండ పారాయణం వినడం వంటివి శ్రేష్ఠం అన్నారు.
ఓం శం శనైశ్చరాయ నమ మంత్రాన్ని పఠించాలనీ, నల్ల నువ్వులు, వస్త్రాలు, ఇనుము, ఆవాల నూనె, పాదరక్షలు దానం చేయటం వల్ల శని దోషాలు, సాడే సతి ప్రభావం తగ్గుతుందన్నారు. రావి చెట్టు, హనుమాన్ ప్రదక్షిణలు చేయండని, నల్ల కుక్కలకు చపాతీలను సమర్పించండని. ముసలివారికి సహాయం చేయండని, అమావాస్య, వట సావితి వ్రతం కూడా రావడంతో ఈ విశేష పూజలు చేయడం వల్ల రాజ యోగం కలుగుతుందన్నారు. నంద్యాల, నూనెపల్లి, చాబోలు, రైతు నగర్ గ్రామాల భక్తులు తరలివచ్చి శనేశ్వరస్వామి జయంతి పూజల్లో పాల్గొన్నారు.
