Kurnool | ఎస్పీని కలిసిన టీడీపీ అధ్యక్ష ,కార్యదర్శులు

Kurnool | ఎస్పీని కలిసిన టీడీపీ అధ్యక్ష ,కార్యదర్శులు

Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఇన్చార్జి ఎస్పీ, డీఐజీ విక్రాంత్ పాటిల్‌ను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ జనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్, డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్, గుడిసె రామకృష్ణ నాగరాజు కూడా పాల్గొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను టీడీపీ నేతలు అభినందించారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం మరింత సమర్థంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, ప్రజా సమస్యలపై పోలీసు స్పందన మరింత బలోపేతం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల సహకారంతోనే శాంతియుత వాతావరణం కొనసాగుతుందని తెలిపారు.

Leave a Reply