ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక కోర్సులు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు.

జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం వద్ద సింగరేణి ఏరియా వర్క్‌షాప్ పక్కన ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో కంప్యూటర్ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అర్థమేటిక్ అండ్ రీజనింగ్, సి లాంగ్వేజ్, జావా, వెబ్ డిజైనింగ్, ట్యాలీ, డేటాబేస్, ఆటోక్యాడ్ తదితర అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ శిక్షణల ద్వారా యువతలో ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంపొందడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అలాగే ప్లేస్‌మెంట్ డ్రైవ్స్, జాబ్ మేళాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి మరియు స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం కొత్త బ్యాచ్‌ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అలాగే క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు 8074031962 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply