Young Man | ఆత్మహత్య కాదంటున్న కుటుంబ సభ్యులు

Young Man | ఆత్మహత్య కాదంటున్న కుటుంబ సభ్యులు

Young Man | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. గోకుల్ ప్లాట్స్‌లో నివసిస్తున్న జనార్దన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ సీఏ చదువుతున్నట్లు సమాచారం. అతడు ఉరివేసుకున్నట్లు కనిపించినప్పటికీ, ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తమ కుమారుడు పిరికివాడు కాదని, ఇది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.