అలుగునూర్ వంతన పై ఘోర రోడ్డు ప్రమాదం

అలుగునూర్ వంతన పై ఘోర రోడ్డు ప్రమాదం
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా అలుగునూరు మానేరు వంతన పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తిమ్మాపూర్ మండల పరిధిలోని అలుగునూరు వంతెన పై బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలప్రకారం.. బీహార్‌కు చెందిన 12 మంది వలస కార్మికులు కటికేనపల్లిలో నివాసం ఉంటూ హమాలీ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌కు ఉపాధి కోసం వెళ్లారు. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
