పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

బెజ్జంకి, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సులోచన, స్టాఫ్ నర్స్ లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ గోపాల్ రెడ్డి, ఎ.ఎన్.ఎం అనిత, వాణి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply