నిరుద్యోగ యువతకు అవకాశాలు..

నిరుద్యోగ యువతకు అవకాశాలు..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఉద్యోగ మిత్ర” కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి మండల పరిధిలోని చలిమడ ఫీడ్స్, తోటపల్లిలో 2 సూపర్వైజర్ పోస్టులు, డెలివరీ డాట్‌కామ్, బెజ్జంకిలో 8 డెలివరీ బాయ్ పోస్టులు, SRR దాబాలో 1 వెయిటర్ పోస్టు, గ్రామపంచాయతీ, బెజ్జంకిలో 5 సానిటరీ వర్కర్ పోస్టులు, PHC, బెజ్జంకిలో 1 స్వీపర్ (అటెండర్) పోస్టు, నరసింహుల పల్లె వైట్ ఫీల్డ్‌లో 25 లేబర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే బెజ్జంకి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఐ బి. సౌజన్య తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని యువత ఉపాధి పొందాలని పోలీస్ శాఖ సూచించింది.

Leave a Reply