అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గుండాల మండలంలోని రైతు వేదికలో 60 స్మార్ట్ ఫోన్లు, 14 కళ్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులను పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి జరుగుతోందని తెలిపారు. 60 మంది లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు అందజేయడం ద్వారా డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అదే క్రమంలో 14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులు అందజేయడం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను రక్షించుకోవాలని సూచించారు. పిల్లల భద్రత రక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, ఎమ్మార్వో ఖాసిం, సీఐ తిరుపతి, ఎస్సై సైదా రాహుప్, ఎంఈఓ పార్వతి, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి ఉపాధ్యక్షులు పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి షేక్ ఖదీర్, నాయకులు వాంకుడోత్ అజయ్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
