పాఠశాల బోర్‌వెల్ మరమ్మతులు చేయించిన సర్పంచ్

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలో గల మొర్రిగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలోని త్రాగునీటి బోర్‌వెల్‌ను శనివారం గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈదుల తిరుపతి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు, విద్యార్థులకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చెడిపోయిన బోర్‌వెల్‌లను వెంటనే మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కల రమ్య రవీందర్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, వార్డు సభ్యుడు వెంకటేష్, గ్రామస్తులు శంకర్, సత్తన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.