చెన్నూరులో బిజెపి సంబరాలు..
చెన్నూరులో బిజెపి సంబరాలు..
చెన్నూర్, ఆంధ్రప్రభ : నేడు వచ్చిన ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో ఘన విజయం సాధించడంతో పాటు కేరళలో ఖాతా తెరిచి రెండు స్థానాలు సంపాదించి బిజెపి ఘన విజయం సాధించిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. చెన్నూరు కొత్త బస్టాండ్ లో జరిగిన విజయోత్సవాల సందర్భంగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాను పశ్చిమ బెంగాల్ గా మార్చాలనుకున్నకాంగ్రెస్ మమతా బెనర్జీల కుట్రలను అక్కడి ప్రజలు గమనించి వారి పాలనను చమురు గీతం పాడారని ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా అనుక్షణం కృషిచేసి ఈ విజయం సాధించారని ఆయన అన్నారు.
మూడవసారి అస్సాంలో ఘనవిజయం సాధించడం ఇమంత బిశ్వ శర్మ నాయకత్వం మరియు బిజెపి పరిపాలన పట్ల అక్కడి ప్రజలకు ఉన్న విశ్వాసం వల్ల సాధ్యమైందని పుదుచ్చేరిలో సైతం రెండవసారి అధికారంలోకి రావడం బిజెపి కార్యకర్తలలో నైతిక ధైర్యం నింపిందని రానున్న తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో సైతం భాజపా విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తుమ్మ శ్రీ పాల్, మాజీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్, పట్టణ బీజేపీ కౌన్సిలర్ లు గర్రెపల్లి శాంతరాణి వెంకట నర్సయ్య,ఏతం శివ కృష్ణ,చెన్నూరు అసెంబ్లీ BLA 1 కన్వీనర్ జాడి తిరుపతి, kvm శ్రీనివాస్, పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్, చాటారీ వెంకన్న, రాజకృష్ణ, కర్ని వెంకట్,తగరం నరేందర్, శ్రీ వర్ధన్, సురేష్ గారు, చెన్నూరు రూరల్ నాయకులు కొఠారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

