10000dropped | శాంతించిన బంగారం, వెండి ధ‌ర‌లు

10000dropped | శాంతించిన బంగారం, వెండి ధ‌ర‌లు

10000dropped | 24 క్యారెట్ల తులం బంగారం – రూ.1,56,930
(రూ.980 తగ్గింది)
22 క్యారెట్ల తులం బంగారం – రూ.1,43,850
(రూ.900 తగ్గింది)
కిలో వెండి ధర రూ.2.9 లక్షలు
(రూ.15వేలు పతనం)

10000dropped | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త అందింది. మూడు రోజుల క్రితం వ‌ర‌కు భ‌గ్గుమ‌న్న బంగారం… మ‌ళ్లీ ధ‌ర త‌గ్గ‌ముఖం ప‌ట్టింది. కేంద్రం దిగుమతి సుంకాల్ని పెంచ‌డంతో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. గ‌త మూడు రోజుల నుంచి భారీగా ప‌డిపోయాయి. మూడు రోజుల్లో క‌లిపి రూ. 10 వేలకుపైగా త‌గ్గింది. వెండి ధ‌ర కూడా రూ. 30 వేలు వ‌ర‌కు దిగొచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బంగారం కొనుగోళ్ల గురించి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఏడాది వ‌ర‌కు గోల్డ్ కొనుగోలు చేయ‌డ‌వ్ద‌ని సూచించారు. దేశంలో విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసుకునేందుకు గోల్డ్ కొన‌డం ఆపేయాల‌ని దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు. పెళ్లిళ్లు, పండగల ఏమి ఉన్నా బంగారం, వెండి ధ‌ర‌లు కొనబోమని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని అంతా అనుకున్నారు. అనుకున్న‌ట్టే కొన్ని రోజులు భారీగా బంగారం, వెండి ధ‌ర‌లు పెరిగాయి. అయితే మూడు రోజుల నుంచి త‌గ్గుముఖం ప‌ట్టడంతో కొనుగోలుదారులు కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్ట‌య్యింది.

హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.980 తగ్గి రూ.1,56,930కి పడిపోయింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.900 తగ్గి రూ.1,43,850 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.730 తగ్గి రూ.1,17,700గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధర కూడా పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై ఏకంగా రూ.15,000 మేర పతనం నమోదైంది. ఈ భారీ తగ్గుదలతో కిలో వెండి ధర రూ.2.9 లక్షలకు దిగివచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లోని మార్పులే దేశీయంగా ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

CLICK HERE TO READ 15May market | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం

CLICK HERE TO READ MORE

Leave a Reply