శాస్త్రీయ దృక్పథం ద్వారానే సమాజంలో మార్పు
శాస్త్రీయ దృక్పథం ద్వారానే సమాజంలో మార్పు
- పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బైరెడ్డి సతీష్ రెడ్డి
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మూడత్వంతో కూడినఆంథ విశ్వాసాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని దీంతో విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకత ఆలోచన దెబ్బతింటుందని పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. బైరెడ్డి సతీష్ రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో
పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర విద్యా- వైజ్ఞానిక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం ద్వారానే సమాజంలో మార్పు సాధించవచ్చఅన్నారు.
సమాజాన్ని పట్టిపీడిస్తున్న కులమత ఆర్థిక అసమానతలుదోపిడి పీడన లాంటి రుగ్మతలు పోవాలంటే నేటి విద్యార్థి, యువత శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు.పి.డి.ఎస్.యుతెలంగాణ రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు జూన్ 11 నుండి 14 వరకు నిర్వహిస్తున్నామన్నారు.
క్లాసుల ప్రారంభానికి ముందు పి.డి.ఎస్.యు. బిగిపిడికిలి జెండాను రాష్ట్ర అధ్యక్షులు కాంపాటీ పృద్వి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థి అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రతినిధులు విద్యార్థి వీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టిపిటిఎఫ్ పూర్వ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ప్రారంభోపన్యాసం చేయగా, సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నారాయణపేట జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడారు. దేశంలోని పౌరులందరూ భౌతిక వాద దృక్పథాన్ని కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మూడత్వంతో కూడిన అంథ విశ్వాసాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, లేకపోతే విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, ఆలోచన శక్తి దెబ్బతింటుందని, ఇది భవిష్యత్తులో దేశ అభివృద్ధికి అవరోధంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రచన ఎలా చేయాలి-ఉపన్యాసం ఎలా ఇవ్వాలి” అనే క్లాసును మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రమ బోధించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, మునిగల శివప్రశాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు సురేష్, కర్క గణేష్, బోయినపల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ పి. అనూష, రాష్ట్ర నాయకులు సీతారాం, అనిల్, మారుతి, లక్ష్మణ్, అషూర్, హరీష్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
