Rangel | ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు
Rangel | ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు
Rangel | రెంజల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని నీలా గ్రామపంచాయతీలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు (Two sarpanch candidates) నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు రేఖ, సునీల్ కుమార్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్పంచ్ అభ్యర్థి గౌరాజీ రాఘవేందర్ (Gouraji Raghavendra) తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
అలాగే సర్పంచ్ అభ్యర్థి మునీర్ (Munir) కూడా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. వార్డు సభ్యులు నామినేషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. రాజేందర్, ఫజల్ ఖాన్, నడిపి గంగాధర్, వడ్ల గంగాధర్, గోసుల రమేష్, ఫయాజ్ ఖాన్, సంజీవ్, అలీ మొద్దీన్, మొజ్జు, షేక్ సమీర్, ఆన్సర్ బెగ్, అత్తర్ కురేసి, షేక్ ఖలీల్, తరుణ్ బెగ్, రమేష్ అలాగే వార్డు సభ్యుల తరపున కార్యక్రమంలో పాల్గొన్నారు.
