Police| భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Police|భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

  • భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు
  • 3 వేల మంది పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, సీపీ ఎసీవీ రాజశేఖరబాబు

Police| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దసరా విజయవంత స్పూర్తితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషసర్ ఎస్పీ రాజశేఖరబాబు అధికారులకు సూచించారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించన్ను భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర, ఆలయ ఈవో వి.కె. శ్రీనానాయక్లు సమన్వయ శాఖల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భవానీ భక్తులు తరలివస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. అయిదు రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి రోజు దాదాపు లక్ష వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. చివరి రెండు రోజుల్లో దాదాపు లక్షా 50 వేల మంది భవానీ భక్తులు రానున్న దృష్టి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విదాదీ దసరా ఉత్సవాలలో అంచనాలకు మించి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన్నప్పటికీ అధికారులు సమన్వయంతో చేసిన ఏర్పాట్లు కారణంగా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించామన్నారు.

ఇదే స్పూర్తితో టీమ్ ఎన్టీఆర్ జిల్లా భవానీ దీక్షల విరమణను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దర్శనాకి తరలివచ్చే భక్తుల ఎటువంటి అసౌకర్యం జరగకుండా 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్కు ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ భాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. పర్యవేక్షణ అధికారులు వారికి కేటాయించిన సెక్టార్ లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా భక్తుల హెూల్డింగ్ పాయింట్లు కేశఖండన ప్రదేశాలు, స్నాన ఘట్టాలు, గిరిప్రదర్శన, క్యూ లైన్లు, ఇరుముడుల సమర్పణ, హోమ గుండం, లడ్డు విక్రయ కేంద్రాలకు సంబంధించిన సెక్టార్ అధికారులు అత్యంత అప్రమత్తంతో పనులు పూర్తి చేసేలా పర్యవేక్షించాలన్నారు.

ఇతర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భవానీ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించలా సమాచార కేంద్రాలు నిరంతరం అనౌన్స్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లడ్డు విక్రయ కేంద్రాలు, ఉ చిత భోజన సౌకర్యకేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. ఈ ఏడాది 10 వేల నుందికి పైగా భక్తులు కలశ జ్యోతులను సమర్పిస్తారని ఇందుకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. క్యూ మార్గంలో వాటర్ ప్రూప్ షామియానాలు, క్వాయిర్ మ్యాట్లు ఏర్పాటు చేయాలని మ్యాట్లను మూడో రోజు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు అవసరమైన తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, హెూల్డింగ్ పాయింట్ల వద్ద మరుగుదొడ్ల సంఖ్య పెంచాలని టోల్ గేట్ నుండి ఓం టర్నింగ్ మధ్యలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

భవానీ భక్తుల దీక్షా వస్త్రాలను స్నాన ఘట్టాల వద్ద వదిలివేస్తారని ఆయా ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వస్త్రాలను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సెక్టార్ అధికారులను సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవానీ ధీక్షల విరమణ కార్యక్రమానికి మూడు వేల మంది పోలీసులకు విధులు కేటాయించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసిన్నట్లు తెలిపారు. నగరంలో 300లకు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అలయ అధికారులు గురుభవానీలతో మాట్లాడి ఈ ఏడాది ఎ ఏ ప్రాంతాల నుండి ఎంత మంది భవానీ భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చేది ముందుగానే అంచనా వేసి తగిన విధంగా దర్శన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాడం జరిగిందన్నారు. ముఖ్యంగా లడ్డు విక్రయ కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక యాప్ ద్వారా ముందుగానే లడ్డులను విక్రయించి టోకెన్లు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సివ్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్షా విరమణలను విజయవంతం చేసేందుకు ప్రణాళికాయుత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు మూడు ప్రదేశాలలో హోమ గుండాల ఏర్పాటు చేస్తున్నామని కలశ జ్వోతులను సమర్పించే భక్తులు, భవానీ భక్తులకు చిన్న లడ్డు, పులిహోర ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ శాఖ సహకారంతో గిరి ప్రదర్శన, అమ్మవారి ఊరేంగింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం సామాన్లు క్లోక్ రూమ్ల సంఖ్య పెంచడం జరిగిందని. 14 కౌంటర్ల ద్వారా లడ్డుల విక్రయానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 850 మంది నాయి బ్రాహ్మణులతో 24 గంటలు కేశఖండన కేంద్రం నిర్వహించడం తో పాటు భవానీ భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది 20 లక్షల లడ్డులు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో దీక్షా విరమణలు జరిగేలా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు.

Leave a Reply