Mukt Bharat | ప్రతి ఒక్కరి పాత్ర కీలకం

Mukt Bharat | ప్రతి ఒక్కరి పాత్ర కీలకం
Mukt Bharat | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో బాల్య వివాహాలను సంపూర్ణంగా నిర్మూలించి నారాయణపేటను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్(Sanchit Gangwar) అన్నారు.
ఈ రోజు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో – బేటీ పడావో(Beti Bachao – Beti Padao) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడాతూ.. “జిల్లాలో ప్రతి ఏటా 50–60 వరకు బాల్య వివాహాలను ఆ శాఖ అధికారులు అరికడుతున్నారు.
ఇంకా పూర్తి స్థాయిలో నిరోధించేందుకు సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి” అని తెలిపారు. బాల్య వివాహాల గురించి సమాచారం లభిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు తెలియజేయాలని పిలుపునిచ్చారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ఎవరూ భయపడవద్దని హామీ ఇచ్చారు. ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్(Trainee Collector Pranai Kumar) మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల సంభవించే ఆరోగ్య, సామాజిక సమస్యలను వివరించారు.
సతీ సహగమనాన్ని నిర్మూలించినట్లే బాల్య వివాహాలను కూడా పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బాల్య వివాహ ముక్త్ భారత్(Mukt Bharat) కార్యక్రమానికి నేటితో సంవత్సరం పూర్తైన సందర్భంగా, దేశంలో నుంచే చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బలోడ్ జిల్లా బాల్య వివాహ రహిత జిల్లాగా గుర్తింపు పొందిందని, అదే విధంగా నారాయణపేట కూడా ఆ దిశగా ముందుకు సాగాలని కోరారు.
