KTR – Jagan | అన్నా బాగున్నావా…!! !!

- జగన్ – కేటీఆర్ ములాఖత్
ఆంధ్రప్రభ : ఎందన్నా.. ఈ కేసుల గోల.. ఈ రేస్ తప్పేంటీ.. ఏదో కుర్రకారు జోష్ కోసం జరిపినం.. ఏం బాగోలే అని కేటీఆర్ అంటే.. సరే.. ఆరేళ్లుగా ఎట్టనో బెయిల్ పై రప్పా రప్పా ఆడినా.. మళ్లీ సీబీఐ కేసుల్తో చస్తన్నా.. లిక్కర్ కేసొకటి చచ్చింది.. అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారని.. సోషల్ మీడియాలో వీరిద్దరి ములాఖత్ ఫోటో వైరల్ అవుతోంది.
బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫంక్షన్ లో మేయిన్ ఫోకస్ గా నిలిచారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యూచర్ సీఎంలు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
