ప్లాస్టిక్ రహిత జిల్లానే లక్ష్యం

ప్లాస్టిక్ రహిత జిల్లానే లక్ష్యం

  • ప్లాస్టిక్ వినియోగం తగ్గిద్దాం
  • గుడ్డ, జూట్ సంచుల వినియోగానికి ప్రాధాన్యం
  • ఇంటి వద్దనే చెత్త వర్గీకరణపై దృష్టి్: కలెక్టర్
  • ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా విస్తృత అవగాహన

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ రహిత జిల్లానే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్లాస్టిక్ రహిత సమాజం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఏర్పేడు బస్టాండ్ కూడలిలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, స్థానిక అధికారులకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

పర్యావరణానికి తీవ్ర ముప్పు..

కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లు, సంచులు, ఒకసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకంతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతోందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి, నీరు, గాలి కాలుష్యానికి కారణమై ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేశారు. పర్యా