నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆత్మ (ATMA) కార్యక్రమం కింద వికారాబాద్ మండలంలోని గొట్టిముకుల రైతు వేదికలో శనివారం రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వినియోగం మరియు హెచ్‌టీఈ పత్తి ప్రభావాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీ రాజేశ్వర్ రెడ్డి నానో ఎరువుల సరైన వినియోగ విధానం, ఖర్చు తగ్గింపు, పంట దిగుబడి పెంపు, అలాగే హెచ్‌టీఈ పత్తి వాడకంతో కలిగే ప్రభావాలపై రైతులకు వివరించారు.

వికారాబాద్ మండల వ్యవసాయ అధికారి జి. ప్రసన్న లక్ష్మి రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు తెలియజేస్తూ, ప్రభుత్వం సూచించిన సాగు విధానాలను పాటించాలని కోరారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అయ్యప్ప రైతులకు పంటల నిర్వహణపై పలు సూచనలు అందించారు.

గ్రామ సర్పంచ్ సమక్షంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.