కళ్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలి

కళ్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలి

– మంత్రి సీతక్క

మంగపేట, ఆంధ్రప్రభ : కళ్యాణ లక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం మంగపేట రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు.

తహసీల్దార్ తోట రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క లబ్ధిదారులకు చెక్కులను అందజేసి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 29 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తోట రవీందర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి, మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్, కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, నాయకులు పూజారి సురేందర్ బాబు, కొమరం బాలన్న, కొమరం సారన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply