నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోండి

నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోండి

జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన మహిళ స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కంచికచర్లలో శనివారం శ్రీలక్ష్మి స్వయంగా ఏర్పాటు చేసుకున్న బ్యూటీషియన్‌, మగ్గం వర్క్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ, నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించడం ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. రైజ్ కేంద్రాల ద్వారా మహిళలకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందితే మహిళలు స్వయం ఉపాధి రంగంలో మరింత విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.