ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ లో మాస్టర్స్ పట్టా పొందిన ప్రజ్వల

నర్సంపేట, ఆంధ్రప్రభ : అమెరికాలోని న్యూజెర్సీలో గల ప్రముఖ సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైన్స్–సైబర్ సెక్యూరిటీ విభాగంలో ప్రతిభ కనబరిచిన నర్సంపేటకు చెందిన పెద్దారపు ప్రజ్వల మాస్టర్స్ పట్టా సాధించారు.
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా ఆమె పట్టాను అందుకున్నారు. ప్రజ్వల తల్లిదండ్రులు పెద్దారపు రమేష్, రాధతో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
విదేశాల్లో ఫోరెన్సిక్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా సాధించిన అరుదైన విద్యార్థుల్లో ప్రజ్వల ఒకరని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఏడో తరగతి వరకు నర్సంపేటలో, ఇంటర్మీడియట్ వరకు వరంగల్‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఫోరెన్సిక్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
తదుపరి ఉన్నత విద్య కోసం అమెరికాలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ప్రజ్వల ప్రతిభతో మాస్టర్స్ పట్టా సాధించారని ఆమె తండ్రి పెద్దారపు రమేష్ తెలిపారు.
