జీవన్ రక్షా అవార్డు-2026 అందుకున్న నవీన్

మోత్కూర్, ఆంధ్రప్రభ: డాక్టర్స్ డే సందర్భంగా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన “మాతృదేవో భవ పితృదేవో భవ” సంస్థ వ్యవస్థాపకులు కురుమేటి నవీన్ జీవన్ రక్షా-2026 అవార్డుకు ఎంపికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ నాయకులు డా. బాబూమోహన్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో గత పది సంవత్సరాలుగా నర్సింగ్ వృత్తిలో సేవలందిస్తూ, రక్తదాతగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేసినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మేడిది సుబ్బారావు ట్రస్ట్, పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో ఈ సత్కారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గౌడ సంఘం చైర్మన్ నాగరాజు గౌడ్, ట్రస్ట్ చైర్మన్ వెంకట్రావు, పీపుల్స్ మీడియా ప్రతినిధులు, డాక్టర్లు, సామాజిక సేవకులు పాల్గొన్నారు.