fire | షార్ట్ స‌ర్క్యూట్‌తో ప్ర‌మాదం

fire | షార్ట్ స‌ర్క్యూట్‌తో ప్ర‌మాదం

fire | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి యూనిట్‌-3లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply