Photos | తిరుపతిలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ
Photos | తిరుపతిలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ
తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతిలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి “2 ఏళ్ల నమ్మకం – సంక్షేమం – అభివృద్ధి” విజయోత్సవ సభకు భారీ సంఖ్యలో కూటమి శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు హాజరయ్యారు.
సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనలో పారదర్శకతపై మాట్లాడారు.
మంత్రి నారా లోకేష్ యువతకు ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక రంగంలో రాష్ట్ర ప్రగతి గురించి వివరించగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు.
సభా ప్రాంగణం కూటమి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు నాయకుల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. సభ విజయవంతంగా ముగియడంతో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

































43taux