AP | సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి నిమ్మల

కర్నూలు బ్యూరో, జూన్ 11, ఆంధ్రప్రభ : కల్లూరు (Kalluru) మండలం, తడకనపల్లె గ్రామంలో బుధవారం రూ.678.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) బుధవారం ప్రారంభించారు.

ఇందులో అంతర్గత సీసీ రోడ్లు, రూ.1.41 కోట్ల వ్యయంతో కర్నూలు – అనుగొండ రోడ్డు నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారురోడ్డు, కల్లూరు మండలం తడకనపల్లె (Tadakanapalle) గ్రామంలో రూ.2250.00 లక్షలు అంచనా వ్యయంతో రెండు వరుసల రహదారిగా వెడల్పు చేసి నిర్మించిన నన్నూరు – చిన్నటేకూరు – కె.నాగలాపురం – గూడూరు – సి. బెలగళ్ – ఎమ్మిగనూరు పనులను, రూ.40లక్షల వ్యయంతో ఎన్ హెచ్ 40 నుండి నన్నూరు ఎస్సీ కాలనీ చర్చి వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు (BT Road) పునర్నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే చరిత, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply