Nagarkurnool ఆర్టీసీ డిపో మేనేజర్‌కు షోకాజ్ నోటీసు.. కలెక్టర్ ఆగ్రహం

Nagarkurnool ఆర్టీసీ డిపో మేనేజర్‌కు షోకాజ్ నోటీసు.. కలెక్టర్ ఆగ్రహం

నాగర్ కర్నూల్ (Nagarkurnool), ఆంధ్రప్రభ నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశానికి గైరహాజరైన ఘటనపై జిల్లా కలెక్టర్ ఏ. మను కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డిపో మేనేజర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశానికి ఆర్టీసీ డిపో మేనేజర్ తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉండగా, ఆయన స్థానంలో క్రింది స్థాయి ఉద్యోగిని పంపించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు భావిస్తూ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

డిపో మేనేజర్‌ను వెంటనే సమావేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించిన కలెక్టర్, ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కలెక్టర్ కార్యాలయ విధుల్లో అధికారులు గైర్హాజరు కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం సహించబోమని ఈ చర్యల ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply