ఎల్ఓసీ పత్రం అందజేత

ఎల్ఓసీ పత్రం అందజేత
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని గుంతలగేరి వీధికి చెందిన జేంది అలీసా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బాధితుడి కుటుంబ సభ్యులకు బుధవారం సాయంత్రం ఎల్ఓసీ అందజేశారు. జేంది అలీసా ఆస్పత్రి ఖర్చులో నిమిత్తం రూ. 5 లక్షల ఎల్ఓసీ అందజేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్నవారికి ఎల్ఓసీ వరం లాంటిదని అన్నారు. అంతకుముందు ఊట్కూర్ మండల కేంద్రంలోని భరత్ నగర్ వీధికి చెందిన రిటైర్డ్ ఫార్మసిస్టు ఎల్కోటి సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఊట్కూర్ చేరుకొని పార్టీవ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిమృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
