Mothkur మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంతకాల సేకరణ

Mothkur మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంతకాల సేకరణ

మోత్కూర్ (Mothkur), ఆంధ్రప్రభ: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సేకరించిన సంతకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించనున్నట్లు కార్మికులు తెలిపారు. సీఎం ఇచ్చిన హామీల మేరకు మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే 2వ పీఆర్‌సీలో కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని, కేటగిరీల వారీగా వేతనాల అమలు చేయాలని కోరారు. 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

తమ సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.

Leave a Reply