ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కే

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కే

ఓటరు జాబితా సవరణలో చురుకుగా పాల్గొనాలి

234 మంది బీఎల్ఏలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పిలుపు

తిరువూరు, (ఆంధ్రప్రభ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గానికి చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

సోమవారం ప్రారంభమైన ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నియోజకవర్గంలోని 234 మంది బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. తమకు కేటాయించిన బూత్‌ల పరిధిలో బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల నమోదు, మార్పులు, సవరణల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేదా లోపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి బీఎల్ఏ క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితానే పునాదిగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, పార్టీ తరఫున బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి బీఎల్ఏ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల హక్కుల పరిరక్షణతో పాటు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని ఆయన అన్నారు.

Leave a Reply