ఉచిత కర్రసాము శిక్షణ తరగతులు…

ఉచిత కర్రసాము శిక్షణ తరగతులు…
పాయకాపురం, ఆంధ్రప్రభ : ఉచిత కర్రసాము శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని క్షత్రియ యువజన సంఘం అధ్యక్షుడు పెనుమత్స అప్పలరాజు కోరారు. ఈ వేసవిలో స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేటటువంటి శిక్షణా తరగతులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో యువతకు కర్రసాము, కత్తిసామును జి. ఆర్. ఆర్ సూర్య పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించబడుతుందని ఆయన అన్నారు.
ఈ నెల27వ తేదీ నుండే శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్, అదర్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, క్షత్రియ సేవ సంఘం అధ్యక్షుడు పెనుమత్స అప్పలరాజు, వలివర్తి దుర్గాప్రసాద్, వలివర్తి రామరాజు క్షత్రియ యువజన సంఘం కమిటీ సభ్యులు పాల్గొని కర్రసాము ప్రాముఖ్యతను వివరించారు. దేశప్రాచీన కళలలో కర్రసాము ఎంతో ముఖ్యమైనదని పి.అప్పలరాజు అన్నారు.
