దివిసీమ పునర్నిర్మాతకు ఘన నివాళులు
దివిసీమ పునర్నిర్మాతకు ఘన నివాళులు
భాషా సంస్కృతి పరిరక్షణలో మండలి వెంకట కృష్ణారావు సేవలు చిరస్మరణీయం
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు విశేష కృషి చేశారని వక్తలు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.

బుధవారం అవనిగడ్డ వంతెన సెంటర్లోని మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు మెరకనపల్లి సుబ్బారావు, జనసేన గ్రామ కన్వీనర్ యర్రంశెట్టి సునీల్, చవాకుల సురేష్, కొక్కిలిగడ్డ నరేంద్ర, కైతేపల్లి అభిషేక్, ఆకుల పవన్ కళ్యాణ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి బండే రాఘవ, డీసీసీబీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్లు మాదివాడ రత్నారావు, యలవర్తి రాజ నాగ మునేశ్వరరావు (చిన్నా), గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య తదితరులు మండలి వెంకట కృష్ణారావు సేవలను స్మరించుకున్నారు.
అలాగే మొగల్ మురాద్ బేగ్, రేపల్లె కృష్ణమూర్తి, కోసూరు పూర్ణచంద్రరావు, మండలి రామ్మోహనరావు, బొప్పన కాశీ విశ్వేశ్వరరావు, బచ్చు శ్రీహరి, బడే సుబ్బారావు, ముళ్లపూడి శ్రీనివాసరావు, భోగాది బాలకృష్ణ, సోమిరెడ్డి, నారేపాలెం శంకరరావు, సిద్ధాబత్తుని హరినాథబాబు, మైలా హరిబాబు, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, పసి, వాహేదుల్లా తదితరులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.
తెలుగు భాష, సంస్కృతి, దివిసీమ అభివృద్ధికి మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు ఆదర్శప్రాయమని వక్తలు పేర్కొన్నారు.
