Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
Kanaka Durga Temple | కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఒక్కరోజే 45 వేల మందికి పైగా అమ్మవారి దర్శనం
68 వేలకుపైగా ప్రసాదాల విక్రయం
అమ్మవారి అన్నదానానికి విశేష స్పందన
హుండీ కానుకల రూపంలో రూ.1.74 లక్షల ఆదాయం
Kanaka Durga Temple | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచీన, ప్రముఖ శక్తి పీఠంగా పేరొందిన ఈ దేవాలయంలో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన భక్తులు సైతం ఇంద్రకీలాద్రిని సందర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు.
మంగళవారం వివరాలు ఇలా..
మంగళవారం ఒక్కరోజే 45,067 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శన టికెట్ల ద్వారా 5,526 మంది ప్రత్యేక దర్శనం పొందారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు నిర్వహించారు. అమ్మవారి ప్రసాదాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. రోజంతా 68,685 ప్రసాదాలు విక్రయించబడగా, 8,757 మంది భక్తులు నిత్య అన్నదాన సేవలో పాల్గొని ప్రసాద భోజనాన్ని స్వీకరించారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి నిదర్శనంగా హుండీ కానుకలు, విరాళాల రూపంలో రూ.1,74,234 ఆదాయం లభించింది. అదేవిధంగా వివిధ ఆర్జిత సేవల్లో 388 మంది భక్తులు పాల్గొనగా, మొక్కులు చెల్లించుకునే క్రమంలో 1,299 మంది తలనీలాలు సమర్పించారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నదానం, క్యూలైన్ల నిర్వహణలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై నిత్యం వెల్లువెత్తుతున్న భక్తజన సందోహం కనకదుర్గమ్మపై భక్తులకున్న అపార విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతూ సంతోషంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు.
CLICK HERE TO READ Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
