kheela warangal | ఇదిగాని నవీన్ కుమార్ కు ఘన సన్మానం
kheela warangal | ఇదిగాని నవీన్ కుమార్ కు ఘన సన్మానం
kheela warangal | ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : నగరంలోని 17వ డివిజన్ గాడేపల్లికి చెందిన ఇదిగాని సుభద్ర-ఐలయ్యల కుమారుడు నవీన్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై ఇటీవల ఉస్మానియా మెడికల్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తన స్వగ్రామమైన గాడేపల్లిలోని అంబేద్కర్ యువజన (యూత్) సంఘం సభ్యులు పసునూరి భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నవీన్ కుమార్ ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గ్రామంలో స్వీట్లు పంపిణీ చేశారు. భాస్కర్ మాట్లాడుతూ.. నవీన్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని నేటి యువతీ యువకులు పట్టుదలతో చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పసునూరి స్వామి, వీరస్వామి, పేతురు కుమార్, రమేష్, సాంబయ్య, సుధాకర్, శివ, అరుణ్, అనిల్, గణేష్, ఐలయ్య, కొమురయ్య, రమేష్, అంబేద్కర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
