గ్రామగ్రామాన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి

గ్రామగ్రామాన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి
మక్తల్, ఆంధ్రప్రభ:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామగ్రామాన బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
