పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఆంధ్రప్రభ ప్రతినిధి ములుగు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన ఈ రోజు ములుగు మున్సిపాలిటీ పరిధిలో నెలకొంది. సిబ్బంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మున్సిపాలిటీలో జేసీబీ డ్రైవర్(JCB Driver)గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్, ఉన్నతాధికారుల సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో వృథాగా నీరు వెళ్లే క్రమంలో జేసీబీతో కాల్వదీస్తుండగా పక్కనే ఉన్న యువకుడు మా ఇంటి ముందే కాలువ తీస్తావా అంటూ ఒక్కసారిగా మీద పడి బండరాళ్లతో దాడి చేసినట్లు తెలిపారు.
అక్కడే ఉన్న మిగతా మునిసిపాలిటీ(Municipality) సిబ్బంది అతనిని ఆపి భాస్కర్‌ను తక్షణమే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం దాడి చేసిన వ్యక్తిపై ములుగు పోలీస్ స్టేషన్లో(Police Station) ఫిర్యాదు చేశారు.
