కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం..

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు
బీఆర్ఎస్ నేత చిందం రవీందర్ కాంగ్రెస్‌లో చేరిక

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి,బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చిందం రవీందర్ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. నారక్కపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షులుగా ఉన్న చిందం రవీందర్,బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం స్థానికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే చిందం రవీందర్ లాంటి నాయకులు పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్త లేదా నాయకుడిని విడిచిపెట్టబోమని,వారికి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి సుమన్,మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రవీందర్ సహా పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply